JDU on PM Modi | మణిపూర్‌లో ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన మరుసటి రోజు ఆ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం సాగింది. ఇతర పార్టీల నిర్మూలనకు దిగుతున్నారని ఇరు పార్టీల నేతలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం-బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ శుక్రవారం రాత్రి ట్వీట్ చేస్తూ బీహార్‌లో జేడీయూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని పేర్కొన్నారు. `అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మణిపూర్‌లోనూ జేడీయూ నిష్క్రమించింది. త్వరలో బీహార్‌లోనూ జేడీయూను లాలూజీ పూర్తిగా తుడిచి పెట్టేస్తారు` అని బీజేపీ ఎంపీ సుశీల్‌కుమార్ మోదీ హిందీలో ట్వీట్ చేశారు.
अरुणांचल के बाद मणिपुर भी JDU मुक्त ।बहुत जल्द लालूजी बिहार को भी JDU मुक्त कर देंगे ।@ANI @ABPNews @News18India @News18Bihar @ZeeBiharNews
— Sushil Kumar Modi (@SushilModi) September 2, 2022
దీనిపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ గట్టిగా రిప్లయ్ ఇచ్చారు. పగటి కలలు కనొద్దని సుశీల్ కుమార్ మోదీని కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని ట్వీట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ సంకీర్ణ ధర్మం పాటించలేదని ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఏడుగురు జేడీయూ ఎమ్మెల్యేల్లో ఐదుగురు అధికార పార్టీలో విలీనం అయ్యారు. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 42 సభల్లో పాల్గొన్నా 243 స్థానాలు గల రాష్ట్రంలో కేవలం 53 స్థానాలకే పరిమితమైందని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా బీజేపీ తనలో కలిపేసుకుంటుందని ఆరోపించారు.
.@SushilModi जी,
आपको स्मरण कराना चाहते हैं कि अरुणाचल और मणिपुर दोनों जगह जद (यू.) ने @BJP4India को हराकर सीटें जीती थी। इसलिए जद (यू.) से मुक्ति का दिवास्वप्न मत देखिए। अरुणाचल प्रदेश में जो हुआ था, वह आपके गठबंधन धर्म के पालन के कारण हुआ था ?
1/2— Rajiv Ranjan (Lalan) Singh (@LalanSingh_1) September 3, 2022
`అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్లలో బీజేపీ@4 ఇండియాను ఓడించి జేడీయూ గెలుపొందిందని గుర్తు చేస్తున్నా. జేడీయూను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని పగటి కలలు కనకండి. సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉంటే అరుణాచల్ ప్రదేశ్‌లో జేడీయూ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేవారా?` అని ప్రశ్నిస్తూ హిందీలో ట్వీట్ చేశారు.
.@SushilModi जी,
2/2…..और मणिपुर में एक बार फिर @BJP4India का नैतिक आचरण सबके सामने है। आपको तो याद होगा 2015 में प्रधानमंत्री जी ने 42 सभायें की, तब जाकर 53 सीट ही जीत पाए थे। 2024 में देश जुमलेबाजों से मुक्त होगा…..इंतजार कीजिए।
— Rajiv Ranjan (Lalan) Singh (@LalanSingh_1) September 3, 2022
మణిపూర్ ఘటనతో బీజేపీకి నైతిక విలువలు లేవని మరోమారు తేటతెల్లమైందని మరో ట్వీట్ చేశారు. `2015లో కేవలం 53 స్థానాలే గెలుపొందిన సంగతి మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకొండి. 2024లో జుమ్లేబాజ్ నుంచి దేశం విముక్తి పొందుతుంది. కొంచెం వెయిట్ చేయండి` అని పేర్కొన్నారు.
मणिपुर में @Jduonline के विधायकों के भाजपा में विलय पर @LalanSingh_1 का कहना हैं कि धन बल के आधार पर सब हुआ @ndtvindia pic.twitter.com/41E6okbTJ1
— manish (@manishndtv) September 3, 2022
`ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ చర్యలు 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ భయాన్ని, నిరాశను బయటపెడుతున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల్లో చేసినట్లే ఢిల్లీలో చేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు జార్ఖండ్‌లో జరుగుతున్న పరిణామాల పర్యవసానాలు దేశమంతా ఉంటాయి` అని జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ స్పష్టం చేశారు.