పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని మోదీ పాదాలు తాకేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే మోదీ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నితీశ్ కుమార్ చేతులు పట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుధవారం బీహార్లోని దర్బంగాలో ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం నితీశ్ కుమార్ పాల్గొన్నారు.
కాగా, వేదికపైకి చేరుకున్న సీఎం నితీశ్ కుమార్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధాని కూర్చొన్న సీటు వద్దకు ఆయన వెళ్లారు. మోదీ కాళ్లు తాకేందుకు కిందకు ఒంగారు. అయితే వెంటనే సీటు నుంచి పైకి లేచిన మోదీ, నితీశ్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. నితీశ్ కుమార్ చేతులు పట్టుకుని ఆయనతో మాట్లాడారు. అలాగే ప్రధాని మోదీకి పెద్ద పూల వేసేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ ప్రధాని పక్కకు జరిగారు. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోవైపు ప్రధాని మోదీ పాదాలు తాకేందుకు నితీశ్ కుమార్ ప్రయత్నించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి. జూన్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ పాదాలను తాకేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు. అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేశారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్లో నవాడాలో జరిగిన లోక్సభ ఎన్నికల ర్యాలీలో కూడా మోదీ పాదాలను నితీశ్ కుమార్ తాకారు.
#Watch– Bihar CM Nitish Kumar tries to touch PM Modi’s feet during a rally in Darbhanga.#NitishKumar #PMModi #Darbhanga #Viral #ViralVideo pic.twitter.com/jVBRCvmSQK
— TIMES NOW (@TimesNow) November 13, 2024
Nitish Kumar को जब मंच पर हाथ पकड़ PM Modi ने खींच लिया, ऐसी बॉन्डिंग देखी क्या ? pic.twitter.com/BB7ct9a5eX
— Bihar Tak (@BiharTakChannel) November 13, 2024