వచ్చే 3 వారాలు అలర్ట్‌గా ఉండాలి.. యూటీలకు కేంద్రం ఆదేశం
3 వారాలు అలర్ట్‌గా ఉండాలి| కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వచ్చే మూడు వారాలు చాలా కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ...

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో వచ్చే మూడు వారాలు చాలా కీలకం అని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పాలిత ప్రాంతాలను హెచ్చరించింది. కరోనా వ్యాప్తిని నివారించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించింది.
కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులు, పోలీసు అధికారులతో నీతిఆయోగ్ సభ్యుడు డా.వీకే పాల్ మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
వచ్చే మూడు వారాల్లో వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉన్నందున ముందే నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా పాజిటివ్ కేసులు గుర్తించేందుకు నిర్ధిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
దేశంలో కొవిడ్ 19 కేసుల పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తదితర ఉన్నతాధికారులతో ‘దేశంలో కరోనా విజృంభణ’ అంశంపై వీకే పాల్ వర్చువల్ సమావేశం నిర్వహించారు.
రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకోవాలని కేంద్రం సూచించింది. కరోనా తీవ్రతకు అనుగుణంగా దవాఖానలను పునరుద్ధరించాలని, ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది.
ఇప్పటికే తాము తీసుకున్న చర్యలను వీకే పాల్‌కు కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు వివరించారు. జనసంచారాన్ని తగ్గించేందుకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నామన్నారు.
ఇంటింటి ప్రచారం చేస్తూ వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నామని, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేశామని తెలిపారు. దాదాపు 90 శాతానికి పైగా ప్రజలకు హోం ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
ఇవి కూడా చదవండి..
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్‌బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
వచ్చే నెల మొదటి వారంలో కరోనా ఉధృతి : ఐఐటీ కాన్పూర్ అధ్యయనం
అక్టోబర్‌లో రానున్న జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’
బ్రిటన్‌లో లాక్‌డౌన్‌కు విశ్రాంతి.. జనంతో నిండిపోయిన రెస్టారెంట్లు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

