వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఇవాళ డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే ఆదివారం వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ప్రైవేటు రిసెప్షన్‌కు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ కూడా వెళ్లారు. ఆ వేడుకలో ట్రంప్‌తో ముకేశ్, నీతా అంబానీలు ఫోటో దిగారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ట్రంప్‌కు ఆ ఇద్దరూ శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా బంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకారోత్సవంలో అంబానీ దంపతులు పాల్గొననున్నారు.
At the Private Reception in Washington, Mrs. Nita and Mr. Mukesh Ambani extended their congratulations to President-Elect Mr. Donald Trump ahead of his inauguration.
With a shared optimism for deeper India-US relations, they wished him a transformative term of leadership, paving… pic.twitter.com/XXm2Sj74vX
— Reliance Industries Limited (@RIL_Updates) January 19, 2025
సాధారణంగా దేశాధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం.. యూఎస్ క్యాపిటల్ ఆవరణలోని బయటి ప్రదేశంలో జరుగుతుంది. కానీ ఈసారి కార్యక్రమాన్ని ఇండోర్స్‌లోనే నిర్వహించనున్నారు. శీతల ఉష్ణోగ్రతల వల్ల కార్యక్రమాన్ని ఇండోర్స్కు మార్చారు. ప్రస్తుతం వాషింగ్టన్ పరిసర ప్రాంతాల్లో మైనస్ 13 ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ప్రమాణస్వీకారోత్సవం తర్వాత.. ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతారు. ఆ తర్వాత పరేడ్ నిర్వహించిన వైట్‌హౌజ్‌కు వెళ్తారు.
Ahead of President-Elect Mr. Donald Trump’s historic swearing-in, Mrs Nita & Mr. Mukesh Ambani attended the Private Reception in Washington.
Their presence celebrated India’s enduring heritage, strong international ties, and growing commitment to fostering shared progress and… pic.twitter.com/gYQ8lLb0Fl
— Reliance Industries Limited (@RIL_Updates) January 20, 2025
అధికార మార్పిడి కార్యక్రమాన్ని వీక్షించేందుకు సుమారు రెండు లక్షల మంది ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్ చేరుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్.. కీలకమైన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇవ్వనున్నారు.