Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 60 ఏళ్ల వయసులోనూ ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటారు. తమ పిల్లలు, కోడళ్లకు ఏమాత్రం తీసిపోకుండా యంగ్‌గా ఉంటారు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నీతా అంబానీ మహిళల కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
మహిళలు తమ ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం తన వయసు 61 ఏళ్లని.. ఇప్పటికీ ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ దినచర్య గురించి వివరించారు. రోజూ 30 నిమిషాల పాటూ ఫిట్నెస్ కోసం సమయం కేటాయించనున్నట్లు వివరించారు. వాకింగ్, జిమ్, స్విమ్మింగ్ వంటివి చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
#WATCH | This International Women’s Day, Reliance Foundation Founder-Chairperson Nita Ambani shares her inspiring fitness journey and invites women of all ages to prioritize their health and wellbeing. With her dedicated workout routine, Nita Ambani shows that age is just a… pic.twitter.com/1WOdfZLh3R
— ANI (@ANI) March 8, 2025
Also Read..
Rahul Gandhi | ఆయన కాంగ్రెస్ నేతగా కాదు.. యూట్యూబర్‌గా వచ్చారు.. రాహుల్ ధారావి పర్యటనపై విమర్శలు
Kamala Harris | కాలిఫోర్నియా గవర్నర్ రేసులో కమలాహారిస్..?
Ranya Rao | కస్టడీలో ఉన్న నటి రన్యారావు శరీరంపై గాయాలు.. డీఆర్ఐ అధికారులు ఏమన్నారంటే..?