Nirmala Sitharaman : అయోధ్యలో ఈనెల 22న రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలను రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం హిందూ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్నించారు. జనవరి 22న రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం లైవ్ టెలికాస్ట్నూ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
అయితే నిర్మలా సీతారామన్ ప్రకటనను దేవాదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు తోసిపుచ్చారు. తమిళనాడు ఆలయాల్లో రాముడి పూజలు, అన్నదాన కార్యక్రమాలపై ఎలాంటి నిషేధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక అయోధ్యలో ఈనెల 22న రామ మందిర కార్యక్రమాల లైవ్ లైటికాస్ట్ను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని అంతకుముందు నిర్మలా సీతారామన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక తమిళనాడులో 200కుపైగా రామాలయాలు ఉన్నాయి.
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో శ్రీరాముడి పేరుతో ఎలాంటి పూజలు, భజన, ప్రసాదం, అన్నదానం నిర్వహించరాదని ప్రభుతవ్ం పేర్కొంది. ప్రైవేట్ నిర్వహకుల చేతిలో ఉన్న ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్స్ చేపట్టరాదని అధికారులు కట్టడి చేశారు. ప్రైవేట్ వ్యక్తులకు చెందిన ఆలయాల్లోనూ ఎలాంటి ఈవెంట్లు నిర్వహించరాదని పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
Read More :