NIRF Rankings | న్యూఢిల్లీ, ఆగస్టు 12: ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్’ (ఎన్ఐఆర్ఎఫ్) తాజా ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ మరోమారు టాప్‌లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్ఐఆర్ఎఫ్’, దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరు ఆధారంగా ఏటా వివిధ విభాగాల్లో టాప్-10 విద్యా సంస్థల పేర్లను విడుదల చేస్తున్నది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10,885 విద్యా సంస్థల పనితీరును పరిశీలించి, 2024 ఏడాదికి ర్యాంకులను సోమవారం వెలువరించింది. ‘ఓవరాల్’, ‘ఇంజినీరింగ్’ రెండు విభాగాల్లోనూ వరుసగా ఆరోసారి ఐఐటీ-మద్రాస్ మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ‘ఓవరాల్’ క్యాటగిరిలో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) రెండో స్థానంలో నిలవగా, యూనివర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ వరుసగా 9వ సారి టాప్ ప్లేస్‌లో నిలిచింది.
1.ఐఐటీ-మద్రాస్
2.ఐఐఎస్సీ-బెంగళూరు
3.ఐఐటీ-బాంబే
4.ఐఐటీ-ఢిల్లీ
5.ఐఐటీ-కాన్పూర్
1.ఐఐటీ-మద్రాస్
2.ఐఐటీ-ఢిల్లీ
3.ఐఐటీ-బాంబే
4.ఐఐటీ-కాన్పూర్
5.ఐఐటీ-ఖరగ్‌పూర్
1.ఐఐఎం-అహ్మదాబాద్
2.ఐఐఎం-బెంగళూరు
3.ఐఐఎం-కోజికోడ్
4.ఐఐఎం-ఢిల్లీ
5.ఐఐఎం-కలకత్తా
1.ఎయిమ్స్-ఢిల్లీ
2.పీజీఐఎంఈఆర్-చండీగఢ్
3.సీఎంసీ-వెల్లూర్
4.ఎన్ఐఎంహెచ్ఏఎన్ఎస్-బెంగళూరు
5.జేఐపీజీఎంఈఆర్ -పుదుచ్చేరి