న్యూఢిల్లీ: దేశంలో మహిళలపై జరుగుతున్న నేరాల గురించి ‘నిర్భయ’ తల్లి ఆశా దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందరి సహకారంతో తమకు న్యాయం జరిగిందని చెప్పారు. అయితే చట్టాలు వస్తున్నప్పటికీ, ఫలితం ఉండటం లేదన్నారు.
మార్పు రావడం లేదనే భావం కొన్నిసార్లు తమను నైరాశ్యానికి గురి చేస్తున్నదని చెప్పారు. చాలా మంది బాధితులు తమ వద్దకు వస్తున్నారని, తాము కేవలం నైతిక మద్దతు మాత్రమే ఇవ్వగలుగుతున్నామని తెలిపారు. వ్యవస్థ సక్రమంగా పని చేయాలన్నారు. ‘నిర్భయ’పై సామూహిక అత్యాచారం జరిగి 11 ఏళ్లవుతున్నా దేశంలో మహిళలపై నేరాలు తగ్గడం లేదన్నారు.