న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్ ఏరియాలో తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలోనే దారుణంగా హత్యకు గురైన నిక్కీ యాదవ్.. హత్యకు కొన్ని గంటల ముందు తన ఇంట్లోకి వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ గేటు నుంచి బయటికి వెళ్లి, తిరిగి లోపలికి వచ్చిన వీడియో ఒకటి, అపార్టుమెంట్ స్టెయిర్ కేసులో మెట్లు ఎక్కుతూ తన ఫ్లాట్‌కు వెళ్తున్న వీడియో ఇంకోటి పోలీసులు గుర్తించారు. ఈ కింది వీడియోల్లో ఆ దృశ్యాలు ఉన్నాయి..
#EXCLUSIVE – Delhi –#Nikki #murder case me there is one video, last visuals of Nikki on CCTV,#DelhiPolice #Delhi #DELHIMURDER #NIKKIYADAV #Nikki pic.twitter.com/tPZP18npG2
— Sujit Gupta (@sujitnewslive) February 15, 2023
ఫార్మసీ విద్యార్థిని అయిన నిక్కీ యాదవ్ (23) గత కొన్నాళ్లుగా సాహిల్ గెహ్లాట్ (24) అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నది. ఈ క్రమంలో సాహిల్ గెహ్లాట్ మరో యువతిని పెండ్లి చేసుకోబోతున్నట్లు ఆ పెండ్లి రేపనగా తెలిసింది. దాంతో నిక్కీయాదవ్ పెండ్లి ముహూర్తం నాడే సాహిల్‌ను కలిసి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇద్దరు కలిసి తమ ఫ్లాట్‌కు సమీపంలోనే కారులో గొడవపడ్డారు. దాదాపు మూడు గంటలపాటు వారి గొడవ జరిగింది.
ఈ క్రమంలో గొడవ ముదరడంతో సాహిల్ డాటా కేబుల్‌తో నిక్కీ మెడకు ఉరి బిగించి చంపేశాడు. అయితే, హత్య అనంతరం మృతదేహాన్ని ఏం చేయాలో తెలియయ భయంతో అదే కారులో వారి దాబాకు తీసుకెళ్లాడు. అక్కడ ఫ్రిడ్జ్‌లో దాన్ని దాచేశాడు. కారులో గొడవను గమనించిన పక్క ఫ్లాట్ వ్యక్తి నిక్కీ యాదవ్ కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా సాహిల్ చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో మంగళవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్రిడ్జ్ నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి ఐదు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.