ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై సీనియర్ సిటిజన్ల (60 ఏండ్లు, ఆపైబడినవారు)కు దేశంలోని కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు పెద్ద ఎత్తున వడ్డీరేట్లను అందిస్తున్నాయి. ఐదేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై ఆకర్షణీయ వడ్డీలను ఇస్తున్నాయి. వాటిలో సుర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గరిష్ఠంగా 8 శాతం వడ్డీరేటును వర్తింపజేస్తున్నది.
టీడీఎస్ కోత పడితే..?
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకే బ్యాంక్ నుంచి ఎఫ్‌డీల ద్వారా సీనియర్ సిటిజన్లు పొందే వడ్డీ ఆదాయం లక్ష రూపాయలను దాటితే సదరు బ్యాంకు టీడీఎస్ (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్) నిబంధనలను అనుసరించాల్సిన అవసరం ఉన్నది. అయితే డిపాజిటర్లు తమ ఆదాయ పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేసినప్పుడు అర్హులైతే టీడీఎస్ పేరిట బ్యాంకర్లు వసూలు చేసిన మొత్తాలను రిఫండ్‌గా పొందవచ్చు. కొన్నిసార్లు ఈ రిఫండ్‌పై వడ్డీని కూడా అందుకోవచ్చు. కాగా, టీడీఎస్‌ను తప్పించుకోవడానికి సీనియర్ సిటిజన్లు ఫారం 15హెచ్‌ను దాఖలు చేస్తే ఉత్తమం అని నిపుణులు పేర్కొంటున్నారు.
స్మాల్ ఫైనాన్స్ వడ్డీ బ్యాంక్ రేటు