Tahawwur Rana : ముంబై 26/11 ఉగ్రదాడుల (Mumbai 26/11 Terror attacks) సూత్రధారి తహవూర్ రాణా (Tahawwur Rana) ఎన్ఐఏ కస్టడీ (NIA custody) ని మరో 12 రోజులు పొడిగించారు. ఇప్పటికే అతడికి విధించిన 18 రోజుల ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సోమవారం ఉదయం రాణాను ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) లో హాజరుపర్చారు.
ఇవాళ ఉదయం కట్టుదిట్టమైన భద్రత మధ్య రాణాను ఎన్ఐఏ హెడ్ క్వార్టర్స్ నుంచి పటియాలా హౌస్ కోర్టుకు తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది దయాన్ క్రిష్ణన్, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరేందర్ మాన్లు ఎన్ఐఏ తరఫున వాదనలు వినిపించారు. ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ నియమించిన న్యాయవాది పీయూష్ సచ్దేవ రాణా తరఫున వాదనలు వినిపించారు.
ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు. దాడి అనంతరం అమెరికాకు పారిపోయిన రాణాను ఇటీవలే స్వదేశానికి రప్పించారు. భారత్ అప్పగించవద్దంటూ రాణా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ఈ నెల 4న అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దాంతో అతడిని భారత్‌కు అప్పగించారు.
కాగా భారత్‌లో అక్రమంగా చొరబడిన 10 ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తమ నరమేథం మొదలుపెట్టారు. రెండు లగ్జరీ హోటళ్లు, రైల్వేస్టేషన్, జెవిస్ సెంటర్ ఇలా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా 60 గంటలపాటు సాగిన నరమేథంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో పలువురు భద్రతాసిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా బలగాల దాడిలో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఉగ్రవాది కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఆ తర్వాత అతడికి ఉరిశిక్ష విధించారు.
NIA has sought further remand of 26/11 terror attack accused Tahawwur Rana. The court has reserved the order. https://t.co/Qs5d5VDsJw
— ANI (@ANI) April 28, 2025