న్యూఢిల్లీ: ఒకసారి వాడిన వంట నూనెను హోటల్స్, తినుబండారాల దుకాణాలు, రోడ్డు పక్కన అమ్మేవాటిల్లో పదే పదే ఉపయోగించడం భారత్లో సర్వసాధారణమై పోయిందని, దీనివల్ల ప్రజా ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని ఎన్హెచ్ఆర్సీ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని తెలిపింది.
నిబంధనల ఉల్లంఘనపై ఎన్హెచ్ఆర్సీ, ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏ)కు నోటీసులు జారీచేసింది. రాష్ర్టాల వారీగా ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా డాటా ఇవ్వాలని ఆదేశించింది.