న్యూఢిల్లీ : భారతీయ రుచులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ఆన్లైన్ వేదికగా పలువురు భిన్న సంస్కృతులకు చెందిన డిష్‌లను ట్రై చేస్తున్నారు. భారతీయ వంటకాలు, స్నాక్స్‌ను విదేశీయులు వండి వార్చే వీడియోలు నెట్టింట (Viral Video) వైరలవుతున్నాయి.
లేటెస్ట్గా న్యూజిలాండ్‌కు చెందిన కుక్ ఆనియన్ బజ్జీని తన భాగస్వామి కోసం తయారుచేసిన వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ క్లిప్‌లో కుక్ ఆనియన్స్‌ను, పచ్చిమిర్చిని కట్ చేయడం చూడొచ్చు. వీటితో పాటు అల్లం, కారం, పసుపు కలిపిన మిశ్రమాన్ని బౌల్లో వేసి దానిలో శనగపిండిని మిక్స్ చేయడం కనిపిస్తుంది.
ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల నీటిని కలిపి పిండిని తయారుచేస్తాడు. ఆపై పాన్ తీసుకుని ఆయిల్‌ను మరిగించి అందులో గోల్ఫ్‌బాల్ సైజ్‌లో ఈ మిశ్రమాన్ని బాల్స్‌లా చేసి నూనెలో ఫ్రై చేస్తాడు. వాటిని చింతపండు చట్నీతో హాట్‌హాట్‌గా సర్వ్ చేయడం ఈ వైరల్ క్లిప్‌లో చూడొచ్చు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మెరుగైన స్పందన లభించింది.
Read More :
Delhi Pollution: ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం.. క్షీణించిన వాయు నాణ్యత