Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
Congress New Rules : దేశంలోని అతిపురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడం ఇకపై ఆషామాషీ వ్యవహారం కాదు. సులభం ఏమాత్రం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే ...

న్యూఢిల్లీ : (Congress New Rules) దేశంలోని అతిపురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడం ఇకపై ఆషామాషీ వ్యవహారం కాదు. సులభం ఏమాత్రం కాదని గుర్తుంచుకోండి. ఎందుకంటే పార్టీ సభ్యత్వం తీసుకోవాలనుకునే వారి కోసం కొత్త నిబంధనలను పార్టీ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకునే వారు మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రకటించాలి. అంతే కాకుండా, పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించమని ప్రమాణం చేయాలంటా. కొత్త ఫారం ప్రకారం సభ్యత్వ నమోదుకు ముందు.. కొత్త సభ్యులు కొన్ని వ్యక్తిగత వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది. సభ్యత్వ కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించనున్నారు. ఇది వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతుంది. వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 20 వరకు కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక జరగనున్నది. ఈ మేరకు ఇటీవలి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఈ నిర్ణయాలను ఆమోదించారు.
కీలక ప్రమాణాలివే..!
- కొత్త సభ్యులు సీలింగ్ చట్టం కంటే ఎక్కువ ఆస్తిని కలిగి ఉండకూడదు.
- పార్టీ విధానాలు, కార్యక్రమాలలో పాల్గొనాలి.
- శారీరక శ్రమ లేదా పనులు చేయడానికి వెనుకాడకూడదు.
- మద్యం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.
- పార్టీ విధానాలను బహిరంగంగా విమర్శించకూడదు.
- ఖాదీ దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి.
- సామాజిక వివక్ష ఉండకూడదు.
- సమాజంలో వివక్షను రూపుమాపేందుకు కృషి చేయాలి.
ఇవి రాజ్యాంగంలో భాగమే: మిస్త్రీ
కొత్త నిబంధనలు రాజ్యాంగంలో భాగమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మధుసూదన్ మిస్త్రీ చెప్పారు. ఇది పాత దరఖాస్తు ఫారం, మా పార్టీ రాజ్యాంగంలో భాగమని తెలిపారు. కొత్త, పాత సభ్యులందరూ అన్ని నియమాలను పాటిస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
జమ్ముకశ్మీర్‌లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

