United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
United Nations : ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతను పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా 1945 లో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్యసమితిని...

(United Nations) ప్రపంచవ్యాప్తంగా శాంతి, భద్రతను పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు ఐక్యంగా 1945 లో సరిగ్గా ఇదే రోజున ఐక్యరాజ్యసమితిని ప్రారంభించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి పరిణామాల నేపథ్యంలో ఈ సంస్థ స్థాపితమైంది. దేశాల మధ్య సరిహద్దు వివాదం నుంచి అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన ఏదైనా సమస్య వరకు, ప్రతి సమస్యకు పరిష్కారం ఐక్యరాజ్యసమితి (యూఎన్) వద్ద దొరుకుతుంది. 1945 అక్టోబర్ 24 న ఏర్పడిన యూఎన్.. ఇవ్వాల్టితో 76 ఏండ్లు పూర్తి చేసుకున్నది.
నిజానికి, 1910-1950 మధ్య రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత భయంకరమైన విషాదాన్ని ప్రపంచం చవి చూసింది. వేలాది మంది మరణించారు. దేశాలు భారీ ఆర్థిక నష్టాలకు గురయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పుడు, అంతర్జాతీయ శాంతి, భద్రత పెద్ద సమస్యగా తయారైంది. దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఒక సంస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యాయి. 1945 లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో అంతర్జాతీయ సంస్థ సమావేశం ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 25 నుంచి జూన్ 26 వరకు కొనసాగిని ఈ సదస్సులో 50 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశం చివరి రోజున ఒక చార్టర్‌పై అన్ని దేశాలు సంతకం చేయగా.. ఈ చార్టర్ 24 అక్టోబర్ 1945 నుంచి అమలులోకి వచ్చింది. అనంతర కాలంలో ఈ సంస్థను ఐక్యరాజ్యసమితిగా పరిణామం చెందింది. అందుకని, అక్టోబర్ 24 న ఐక్యరాజ్యసమితి స్థాపక దినోత్సవం జరుపుకుంటాం.
యూఎన్ ప్రధాన అంగాలు
జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ట్రస్టీషిప్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యూఎన్ సెక్రటేరియట్. ఇవన్నీ 1945లో ఐక్యరాజ్యసమితితో కలిసి ఏర్పడ్డాయి. యూఎన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్నది. ఇందులో 193 సభ్య దేశాలు ఉన్నాయి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, యునెస్కో, యునిసెఫ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు అనుబంధంగా ఉన్నాయి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
2005: ‘మదర్ ఆఫ్ సివిల్ రైట్స్ మూవ్మెంట్’ రోసా పార్క్స్ అమెరికాలో మరణం
2004: అంతరిక్షంలో మొదటి విజయవంతమైన రాకెట్ పరీక్షను నిర్వహించిన బ్రెజిల్
1975: బాండెడ్ లేబర్ వ్యవస్థ అంతానికి అమలులోకి వచ్చిన ఆర్డినెన్స్
1946: అంతరిక్షం నుంచి తొలిసారిగా భూమి మొదటి చిత్రం క్లిక్ చేశారు
1915: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఓటు హక్కు కోసం ప్రదర్శన చేపట్టిన 25,000 మంది మహిళలు
1861: అమెరికా అధ్యక్షుడు లింకన్‌కు మొదటి ఖండాంతర టెలిగ్రాఫ్ సందేశాన్ని పంపిన కాలిఫోర్నియాకు చెందిన జస్టిస్ స్టీఫెన్ జే ఫీల్డ్
1851: కోల్‌కతా-డైమండ్ హార్బర్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైన్ ప్రారంభం
1605: ఆగ్రాలో సింహాసనాన్ని చేపట్టిన మొఘల్ చక్రవర్తి జహంగీర్
ఇవి కూడా చదవండి..
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

