Mann Ki Baat : టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
Mann Ki Baat : కొవిడ్ టీకా విషయంలో భారతదేశం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నదని, ఈ విజయంతో దేశం కొత్త శక్తితో ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర...

(Mann Ki Baat) న్యూఢిల్లీ : కొవిడ్ టీకా విషయంలో భారతదేశం అతి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నదని, ఈ విజయంతో దేశం కొత్త శక్తితో ముందుకు సాగుతున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరని సూచించారు. సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా బిర్సా ముండా మనకు నేర్పించారని కొనియాడారు. అలాగే, పోలీసు, భద్రతా దళాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం ముదావహం అన్నారు.
ఆదివారం ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ‘మీ అందరికీ నమస్కారం పెడుతున్నాను. హలో కూడా చెప్తున్నాను ఎందుకంటే 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేయడంలో మీ సహకారం మరువలేనిది. ఈ విజయంతో ఇవాళ దేశం కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో ముందుకు సాగుతున్నది. మన టీకా కార్యక్రమం విజయం భారతదేశ సామర్థ్యాన్ని చూపుతున్నది. దేశ ప్రజలకు టీకాలు వేయడానికి మన ఆరోగ్య కార్యకర్తలు ఏమాత్రం తీసిపోరని తెలుసు. వారి సంకల్పంతో మానవాళికి సేవ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పారు. ఎన్నో సవాళ్లను అధిగమించి మనకు రక్షణగా నిలిచారు’ అని తెలిపారు.
‘సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మనకు ఐక్యత సందేశాన్ని అందించారు. ఆయన చూపిన మేరకు కార్యాచరణలో మనమందరం తప్పనిసరిగా చేరాలి. యురీ నుంచి పఠాన్‌కోట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం ద్వారా జమ్ముకశ్మీర్ పోలీసు సిబ్బంది ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. మన ఐక్యతతోనే దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లగలమని సర్దార్ చెప్పేవారు. మనలో ఐక్యత లేకపోతే మనం కొత్త విపత్తుల్లో చిక్కుకున్నట్లే భావించాలి’ అని సూచించారు.
సంస్కృతి, మూలాల గురించి గర్వపడేలా..
నవంబర్ 15 న వీర యోధుడు లార్డ్ బిర్సా ముండా జన్మదినం రాబోతున్నదని నరేంద్ర మోదీ చెప్పారు. బిర్సా ముండా తన సంస్కృతిని, తన అడవిని, తన భూమిని కాపాడుకోవడానికి పోరాడాడని అన్నారు. అతను మన సంస్కృతి, మూలాల గురించి గర్వపడాలని బోధించిన మహానీయుడని కొనియాడారు. ఇక సైన్యం, పోలీసు వంటి సేవలు పురుషుల కోసం మాత్రమే అని గతంలో అభిప్రాయం ఉండేదని, నేడు కాదని నిరూపితమైందని ప్రధాని అన్నారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గణాంకాల ప్రకారం గత కొన్నేండ్లుగా మహిళా పోలీసుల సంఖ్య రెట్టింపు అయ్యిందని, ఇది సంతోషకరమన్నారు.
ఇవి కూడా చదవండి..
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

