Turkey’s big decision : 10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ
Turkey's big decision : పది దేశాల రాయబారులపై టర్కీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాయబారులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బహిష్కరన వేటు వేశారు. దేశీయ వ్యవహారాల్లో...

(Turkey’s big decision) ఇస్తాంబుల్ : పది దేశాల రాయబారులపై టర్కీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాయబారులపై టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ బహిష్కరన వేటు వేశారు. దేశీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీతోపాటు 10 దేశాల రాయబారులను బహిష్కరిస్తున్నట్లు టర్కీ వెల్లడించింది. ఈ మేరకు ఎర్డోగాన్ శనివారం తన విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించారు.
సామాజిక కార్యకర్త ఉస్మాన్ కావాలా విడుదలకు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, డెన్మార్క్, స్వీడన్, నెదర్లాండ్స్, నార్వే, ఫిన్లాండ్, న్యూజీలాండ్ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ దేశం అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు దూరడాన్ని టర్కీ జీర్ణించుకోవడం లేదు. దాంతో ఆయా దేశాల రాయబారులకు దేశ బహిష్కరణ విధించారు. 48 నుంచి 72 గంటల్లోపు దేశం విడిచి వెళ్లిపోవాలని వారి ఆదేశాలు జారీ చేశారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ వాయవ్య టర్కీలోని ఎస్కిహిర్ నగరంలో చేసిన ప్రసంగంలో ఈమేరకు సమాచారమిచ్చారు.
ఈ చర్యతో ఆయా దేశాలు టర్కీ ఆగ్రహాన్ని అర్థం చేసుకుంటాయని ఎర్డోగాన్ తీవ్ర స్వరంతో చెప్పారు. అయితే, టర్కీ తీసుకున్న ఈ చర్యపై ఇప్పటి వరకు ఏ దేశం నుంచి ఎలాంటి స్పందన ప్రకటన రాలేదు.
ఎవరీ ఉస్మాన్ కావాలా..?!
ఉస్మాన్ కావాలా నాలుగేండ్లుగా జైలులో ఉంటున్నాడు. 2013 లో దేశవ్యాప్త నిరసనలకు నిధులు సమకూర్చాడని ఇతడిపై ఆరోపణలు ఉన్నాయి. 2016 విఫలమైన తిరుగుబాటు వెనుక కవాలా హస్తం ఉన్నట్లు టర్కీ ప్రభుత్వం ఆరోపించింది. 2017లో కావాలాను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇలాఉండగా, రాయబారులపై బహిష్కరణ వేటుతో టర్కీకి సమస్యలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. టర్కీ తీసుకున్న ఈ చర్య అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే టర్కీపై అమెరికా కఠిన ఆంక్షలు విధించింది. ఫ్రాన్స్‌తోపాటు ఇతర పాశ్చాత్య దేశాలు టర్కీపై పరిమితులను విధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
టీకాతో భారత్ పెద్ద విజయం సొంతం చేసుకున్నది : ప్రధాని మోదీ
ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే, ఈ ‘క్రైయింగ్ రూం’కు రండి!
శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
హైబీపీ ఉన్నదని తెలిపే లక్షణాలివే..!
ఈ చెక్క కత్తి .. స్టీల్ కత్తి కంటే వెరీ షార్ప్ గురూ!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

