న్యూఢిల్లీ, మార్చి 21: దేశంలో కొత్త ఉద్యోగాల కల్పన ఈ ఏడాది జనవరిలో 20 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. 2022 డిసెంబర్‌తో పోలిస్తే 2023 జనవరిలో ఈపీఎఫ్‌వో కొత్త సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 7.5% తగ్గింది. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సోమవారం విడుదల చేసిన తాజా పేరోల్ గణాంకాల ప్రకారం.. నిరుడు డిసెంబర్లో 8,40,372 మంది కొత్త సబ్‌స్ర్కైబర్లు ఈపీఎఫ్‌వోలో చేరారు.
ఈ ఏడాది జనవరిలో ఈ సంఖ్య 7,77,232కు దిగజారింది. ఈ ఏడాది ప్రారంభంలో 10 లక్షలకుపైగా ఉన్న కొత్త చందాదారుల సంఖ్య జనవరి చివరి నాటికి 7,77,232కు దిగజారింది. 2021 మే తర్వాత ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి. 2021 మే నెలలో 6,49,618 మంది కొత్త సబ్‌స్ర్కైబర్లు ఈపీఎఫ్‌వోలో చేరారు.