గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 24, 2020 , 13:26:45

వైద్య పరికరాల తయారీ కోసం కొత్త కోర్సు...

వైద్య పరికరాల తయారీ కోసం కొత్త కోర్సు...

ఢిల్లీ : వైద్య పరికరాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వైద్య అవసరాలను తీర్చగల వర్ధమాన విజ్ఞానశాస్త్రాలు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడానికి, పరికరాలను మరింత మెరుగుపర్చడానికి ఈ రంగంలోని సుశిక్షితులకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ రంగంలో నిపుణులను ఉత్పత్తి చేయడానికి గువాహటి, హైదరాబాద్ ఎస్.ఎ.ఎస్ నగర్ (మొహాలి) ఎన్ఐపీఆర్లు వైద్యపరికరాల్లో కొత్త ఎం.టెక్ కోర్సును ప్రవేశపెట్టాయి.

మెడికల్ పరికరాల అభివృద్ధికి అవసరమైన జీవశాస్త్రం, కెమిస్ట్రీ, గణితం, క్లినికల్ సైన్స్  ఇంజనీరింగ్‌కు సంబంధించిన అంశాలతో ఈ కోర్సును తీర్చిదిద్దారు. ఇందులో వివిధ వైద్య పరికరాల నమూనాలను అభివృద్ధి చేయడానికి ఒక సంవత్సరం ప్రాజెక్ట్  వర్క్ కూడా ఉంటుంది. బీఫార్మా, ఫార్మ్ డి, ఎమ్మెస్సీ, బీటెక్, బీఈ, ఎంబీబీఎస్, బీడీఎస్, బీవీఎస్సీ కోర్సులు చదివిన వారు ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశం పొందడానికి అర్హులు. 

ప్రతి బ్యాచ్లో ప్రతి ఏడాదికి పది మందికి మాత్రమే అడ్మిషన్లు ఇస్తారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ,  మెడికల్ డివైస్ ఇండస్ట్రీలో పరిశోధన సిబ్బందిగా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు. వైద్యపరికరాల రంగం  కోసం స్టార్టప్లను ఏర్పాటు చేయవచ్చు.

 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన తేదీ - 22 అక్టోబర్, 2020

నమోదుకు చివరి తేదీ - 15 నవంబర్, 2020

ఆన్‌లైన్ ఎన్ఐపీఈఆర్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 4 డిసెంబర్, 2020

పూర్తి వివరాల కోసం  Website: http://www.niperhyd.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు... 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.