NEET-UG Retest : నీట్-యూజీ రీటెస్ట్పై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం డాక్టర్ ఫరూక్ అబ్ధుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది విద్యార్ధులపై నేరం వంటిందని, వారు పట్టుదలతో చదవడం ద్వారా క్వాలిఫై అయ్యారని, ప్రశ్నాపత్రాల కొనుగోలుతో కాదని పేర్కొన్నారు.
పరీక్ష మళ్లీ నిర్వహించడం ద్వారా విద్యార్ధులను మరింత ఇబ్బందులకు లోనుచేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడైతే తప్పు జరిగిందో ఆయా ప్రాంతాల్లో పరీక్షలు మళ్లీ నిర్వహిస్తే చాలని, దేశవ్యాప్తంగా రీటెస్ట్ నిర్వహణ సరైంది కాదని అన్నారు. దేశమంతటా పరీక్ష నిర్వహణ సులభమైన ప్రక్రియ కాదని, తిరిగి పరీక్ష నిర్వహించడం దురదృష్టకరమని ఫరూక్ అబ్ధుల్లా వ్యాఖ్యానించారు.
Read More :
Govt Junior Colleges | ఇట్లుంటె ఎట్లొస్తరు.. అధ్వాన్నంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు