న్యూఢిల్లీ : నీట్-యూజీ ఫలితాలను జూలై 20 కల్లా విడుదల చేస్తామని ఎన్టీఏ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఫలితాల విడుదలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు మూల్యాంకన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. తద్వారా ఎలాంటి వాయిదా లేకుండా అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావొచ్చని చెప్పారు.
సాధారణంగా పరీక్ష నిర్వహించిన తర్వాత 45 రోజులకే ఫలితాలు రిలీజ్ చేస్తామని.. ఈ సారి 37 రోజుల్లోనే పరీక్ష నిర్వహించినందున వీలైనంత త్వరగానే ఫలితాలు వస్తాయన్నారు.