NEET UG 2026: జూన్ 21 నీట్ పరీక్ష.. కొత్త తేదీ ప్రకటించిన ఎన్టీఏ
NEET UG 2026: నీట్ రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించారు. జూన్ 21వ తేదీ ఆదివారం ఆ పరీక్షను మళ్లీ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ చెప్పింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని తెలిపింది. మే 3వ తేదీ జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల ఆ ఎగ్జామ్‌ను రద్దు చేశారు. దీంతో ఎన్టీఏ కొత్త పరీక్ష తేదీని ప్రకటించింది.
న్యూఢిల్లీ : వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష(NEET UG 2026) తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. జూన్ 21వ తేదీ, ఆదివారం రోజున పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. మే 3వ తేదీన జరిగిన నీట్ యూపీ పరీక్ష పేపర్ లీకైన విషయం తెలిసిందే. దీంతో ఆ ఎగ్జామ్‌ను ఎన్టీఏ రద్దు చేసింది. అయితే విద్యార్థులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రీ ఎగ్జామినేషన్ తేదీని ప్రకటించింది. ఎన్టీఏకు చెందిన అధికార సమాచార ఛానల్స్‌ను మాత్రమే నీట్ అభ్యర్థులు, విద్యార్థుల పేరెంట్స్ ఫాలోకావాలని ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితోనే జూన్ 21వ తేదీన నీట్ యూజీ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది. మరింత సమాచారం కోసం ఈ నెంబర్లకు ఫోన్ చేయగలరు 📞 011-40759000 / 011-69227700.
📢 NEET (UG) 2026 — Examination Date Announced
The National Testing Agency, with the approval of the Government of India, has scheduled the re-examination of NEET (UG) 2026 on Sunday, 21 June 2026.
Candidates and parents are requested to rely only on the official channels of NTA.…— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

