NEET | నీట్‌కు మరో ఇద్దరు బలి.. తమిళనాడులో ఒకరు, గుజరాత్లో మరొకరు సూసైడ్
దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్ రీ టెస్ట్‌కు హాజరు కావాల్సిన అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏండ్ల బాలుడు గురువారం తాను ఉంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
- రీఎగ్జామ్‌కు ముందు పెరుగుతున్న విద్యార్థుల బలవన్మరణాలు
అహ్మదాబాద్ : దేశంలో నీట్ మరణ మృదంగం కొనసాగుతూనే ఉన్నది. తీవ్ర నిరాశ, నిస్పృహ, ఆందోళనలతో నీట్ అభ్యర్థులు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నీట్ ఒత్తిడి మరో ఇద్దరు అభ్యర్థులను పొట్టనపెట్టుకుంది. ఈ నెల 21న జరిగే నీట్ రీ టెస్ట్‌కు హాజరు కావాల్సిన అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏండ్ల బాలుడు గురువారం తాను ఉంటున్న ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే తమిళనాడులోని కోయంబత్తూరులో 19 ఏండ్ల విద్యార్థిని కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అహ్మదాబాద్‌లోని త్రగడా ప్రాంతంలోని ఆరిస్టో ఆనందంలో నివసిస్తున్న 17 ఏండ్ల బాలుడు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2.55 గంటలకు తాను ఉంటున్న ఆరో అంతస్తులోని ఫ్లాట్ బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
అలాగే మరో ఘటనలో కోయంబత్తూరులో నివసిస్తున్న అనున్‌కీర్తన ఈ నెల 21న నీట్ రీ టెస్ట్‌కు హాజరవుతున్నది. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాసిన ఆమె నీట్ పేపర్ లీక్‌తో తీవ్ర నిరాశ పడింది. మళ్లీ పరీక్షకు హాజరవ్వడానికి తీవ్ర ఒత్తిడికి లోనయ్యి ఆత్మహత్యకు పాల్పడింది. గత రెండు రోజుల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమిళనాడులో నిరసనలు నీట్ అభ్యర్థిని మరణంతో తమిళనాడులో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. కోయంబత్తూరు, ఇతర ప్రాంతాల్లో సీపీఐ (ఎం), డీఎంకే ఆందోళనలు నిర్వహించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

