కవాడిగూడ/రామంతాపూర్, ఆగస్టు 13: ఆయుష్ వైద్యులస్టైఫండ్ పెంచడంతో పాటు వారి మస్యలను పరిష్కరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సమస్యలు తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఆయుష్ వైద్యుల స్టైఫండ్ పెంపు కోసం ఇందిరాపార్కు వద్ద కొనసాగుతున్న మహాధర్నా గురువారం 10వ రోజుకు చేరుకుంది. ఈ ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు.. ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్రెడ్డి, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, అంజిరెడ్డి, తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్బిరాజ్, తెలంగాణ జాయింట్ సెక్రెటరీ రాజు, డాక్టర్ జోత్స్న తిరునగరి, డాక్టర్ జయకృష్ణ పాల్గొని మద్ధతు పలికారు. ఇది కేవలం ైస్టెఫండ్ కోసం చేస్తున్న పోరాటం కాదని ఆయుష్ వైద్య విద్యార్థుల భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటమని అన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలన్నారు.
జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఆయుష్ వైద్యు ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తున్నదన్నారు. పది రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నా తమ సమస్యను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. న్యా యం జరిగేంత వరకూ ధర్నాను విరమించేది లేదన్నారు. బీఆర్కేఆర్ ప్రభు త్వ ఆయుర్వేద వైద్య కళాశాల, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల, జేఎస్పీఎస్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాల, నిజామియా టీఈ యునాని వైద్య కళాశాల, ప్రభుత్వ నేచర్ క్యూర్ ఆసుపత్రులకు చెందిన వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులు, జేఏసీ ప్రధాన కార్యదర్శి అఖిల్ కుమార్, డాక్టర్ నితిన్, నవనీత్, డాక్టర్ బలీగ్, డాక్టర్ దర్శిని, ముషీర్, మహ్మూద్ పాల్గొన్నారు.
స్టైఫండ్ పెంపు కోసం ఆయుష్ జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెలో పాల్గొనేందుకు రామంతాపూర్ హోమియోపతి వైద్య విద్యార్థులు రామంతాపూర్ నుంచి ఇందిరాపార్ ధర్నాచౌక్ వరకు ర్యాలీగా తరలివెళ్లారు. 10 సంవత్సరాలుగా ైస్టెఫండ్ పెంచకపోవడం, వైద్య విద్యార్థుల పట్ల కొనసాగుతున్న అసమానత, వివక్షకు నిదర్శనమని మండిపడ్డారు.