NDA | ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. ఎన్డీయేకు 324.. ఇండియా కూటమికి 208 సీట్లు
దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొనసాగాలా?. అంటే అవుననే అంటున్నది ఇండియా టుడే-సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నివేదిక.
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (NDA)కూటమి అధికారంలోకి రానుందా.. 12 ఏండ్లుగా అధికారం కోసం ఎదురుచూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదా?. రాహుల్ గాంధీ మరో ఐదేండ్లపాటు విపక్షంలోనే కొనసాగాలా?. అంటే అవుననే అంటున్నది ఇండియా టుడే-సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నివేదిక. దేశంలో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 324 సీట్లు లభిస్తాయని సర్వేలో తేలింది. విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 208 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని స్పష్టమైంది. ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 14 దాకా ఈ సర్వేను నిర్వహించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ లోక్సభ నియోజకవర్గాల్లో 54,788 మందిని ప్రశ్నించారు. సీవోటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా ద్వారా మరో 1,52,038 మంది అభిప్రాయాలు సేకరించారు. మొత్తంగా 2,06,826 మంది అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సర్వే నివేదికను రూపొందించారు. దీనిద్వారా లోక్సభకు ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయే మళ్లీ ఘన విజయం సాధించడం తథ్యమని వెల్లడైంది. పార్టీల పరంగా చూస్తే బీజేపీకి సొంతంగా 260 సీట్లు, కాంగ్రెస్కు 97 సీట్లు రానున్నాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 44 శాతం ఓట్లు లభించగా, ఇప్పుడు 46.7 శాతం ఓట్లు, ఇండియా కూటమికి 40.9 శాతం ఓట్లు లభిస్తాయని సర్వే పేర్కొంది.

ఇండియా టుడే-సీ వోటర్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే..
అయితే గత ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో బీజేపీకి 281 సీట్లు వస్తాయని తేలింది. తాజాగా ఆ సంఖ్య 21 స్థానాలు కోల్పోయి 260కి పడిపోయింది. అదేవిధంగా ఎన్డీయే కూటమికి 343 రాగా, అది 324కు తగ్గింది. ఇక కాంగ్రెస్ పార్టీ 78 స్థానాల్లో గెలుస్తుందని ఫిబ్రవరిలో తేలగా, ఇప్పుడు ఆ సంఖ్య 97కు పెరిగింది. ఇది 2024 ఎన్నికల్లో కంటే 2 స్థానాలు తక్కువ కావడం గమనార్హం.
2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 543 స్థానాలకుగాను బీజేపీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మెజార్టీ మార్కుకు మరో32 సీట్లు దూరంలో నిలిచిపోయింది. దీంతో మిత్రపక్షాల సహాయంతో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తంగా ఎన్డీయేకు ప్రస్తుతం 293 సీట్లున్నాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఇండీ కూటమి 234 సీట్లు సాధించింది. విపక్షాలన్నీ ఒక్కటై పోటీచేసినప్పటికీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

