Jitan Ram Manjhi : బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly elections) కోలాహలం జోరందుకుంది. అధికార, ప్రతిపక్ష కూటమిలు సీట్ల షేరింగ్‌లో బిజీగా ఉన్నాయి. ఆదివారం ఎన్డీయే కూటమి సీట్ల షేరింగ్ ప్రక్రియను పూర్తిచేసింది. అందులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా (HAM) పార్టీకి 6 స్థానాలు దక్కాయి.
దీనిపై ఇవాళ జితన్ రామ్ మాంఝీ స్పందించారు. మొత్తం 243 సీట్లలో తాము 15 సీట్ల కోసం డిమాండ్ చేశామని, కానీ కూటమి 6 సీట్లు మాత్రమే ఇచ్చిందని అన్నారు. అయినా కూటమి నిర్ణయాన్ని తాము గౌరవిస్తున్నామని చెప్పారు. బీహార్ గొప్పగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామన్నారు. బీహార్‌లో మళ్లీ ఎన్డీయే కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పారు.
కాగా బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకుగాను ఎన్డేయే కూటమిలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, జేడీయూ తలా 101 స్థానాల్లో బరిలో దిగుతున్నాయి. మిగిలిన 41 స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్‌జనశక్తి పార్టీ 29 స్థానాల్లో పోటీచేయనుంది. మిగిలిన 12 స్థానాల్లో హిందుస్థానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీలు ఆరేసి స్థానాల్లో పోటీపడనున్నాయి.