Exit Polls | ఎన్డీయే కూటమి హ్యాట్రిక్.. అసోంలో మళ్లీ విజయం అధికార ఎన్డీయేదే
Exit Polls : అసోంకు సంబంధించిన ఎగ్టిట్ పోల్స్ విడుదలయ్యాయి. అనేక సంస్థల అంచనా ప్రకారం అసోంలో బీజేపీ ఆధ్వర్యంలోని అధికార ఎన్డీయే కూటమిదే మళ్లీ విజయం.
Exit Polls : అసోంకు సంబంధించిన ఎగ్టిట్ పోల్స్ విడుదలయ్యాయి. అనేక సంస్థల అంచనా ప్రకారం అసోంలో బీజేపీ ఆధ్వర్యంలోని అధికార ఎన్డీయే కూటమిదే మళ్లీ విజయం. అసోంలో ఇప్పటివరకు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేనే అధికారంలో ఉంది. హిమంత బిశ్వ శర్మ సీఎంగా కొనసాగుతున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఎన్డీయే విజయం సాధించబోతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.
అసోంలో 126 అసెంబ్లీ సీట్లు ఉండగా, 64 సీట్లు సాధిస్తే అధికారం సాధ్యం. తాజా అంచనాలివి. మ్యాట్రిక్స్ అంచనా ప్రకారం బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయేకు 88–98 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 22–32 సీట్లు, ఇతరులకు 3–5 సీట్లు, చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం ఎన్డీయేకు 85–95 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 25–32 సీట్లు, ఇతరులకు 6–12 సీట్లు, పోల్ డైరీ అంచనా ప్రకారం ఎన్డీయేకు 88–101 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 15–26 సీట్లు, ఇతరులకు 3–7 సీట్లు, యాక్సిస్ మై ఇండియా సంస్థ అంచనా ప్రకారం ఎన్డీయేకు 88–100 సీట్లు, కాంగ్రెస్ కూటమికి 24–36 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.
అన్నింట్లోనూ బీజేపీ కూటమి ఘన విజయం ఖాయంగా కనిపిస్తోంది. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన ఎన్డీయే కూటమి అసోంలో మరోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనేది అంచనా.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

