బెంగళూరు: కర్ణాటకలో పట్టును బీజేపీ నిలుపుకోనున్నట్లు తెలుస్తున్నది. ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) అంచనాల ప్రకారం లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఈసారి అధిక సీట్లు గెలుచుకోనున్నది. కర్ణాటకలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్డీయేకు 20, కాంగ్రెస్‌కు 8 సీట్లు వస్తాయని టీవీ9 భారత్‌వర్ష్-పోల్‌స్ట్రాట్ అంచనా వేశాయి. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ప్రకారం ఎన్డీయేకు 23-25 సీట్లు, కాంగ్రెస్‌కు 3-5 సీట్లు రానున్నాయి. ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ సర్వే ప్రకారం ఎన్డీయేకు 19-25, కాంగ్రెస్‌కు 4-8 సీట్లు వస్తాయి.
కాగా, ఎన్డీయే 21-23, కాంగ్రెస్ 7-5 సీట్లు గెలుస్తాయని జన్‌కీ బాత్ అంచనా వేసింది. రిపబ్లిక్ టీవీ-పీ మార్క్ ప్రకారం ఎన్డీయేకు 22, కాంగ్రెస్‌కు 6 సీట్లు రానున్నాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ ప్రకారం ఎన్డీయేకు 23-25, కాంగ్రెస్‌కు 3-5 స్థానాలు వస్తాయి. ఎన్డీయేకు 23 సీట్లు, కాంగ్రెస్‌కు 5 సీట్లు వస్తాయని ఇండియా న్యూస్-డి-డైనమిక్స్ అంచనా వేసింది.