న్యూఢిల్లీ: కర్ణాటకలో బీజేపీ పాదయాత్ర నుంచి తప్పుకుంటున్నట్టు మిత్రపక్ష జేడీఎస్ ప్రకటించింది. ముడా స్కామ్‌పై ఆగస్టు 3 నుంచి 10 వరకు బెంగళూరు నుంచి మైసూరు వరకు బీజేపీ చేపట్టిన పాదయాత్రలో పాల్గొనటం లేదని జేడీఎస్ నేత, కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. వర్షాలతో ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారని, పాదయాత్రకు సమయం కాదని అన్నారు. అంతేకాదు బీజేపీ తీరుపై ఆయన మండిపడ్డారు. పాదయాత్ర చేపట్టడంపై జేడీఎస్‌ను బీజేపీ సంప్రదించలేదని ఆయన తప్పుబట్టారు.