Shivaji Maharaj statue incident : మహారాష్ట్రలోని సింధ్‌దుర్గ్‌లో శివాజీ మహరాజ్ విగ్రహం నేలకూలిన ఘటన దుమారం రేపుతోంది. విగ్రహం కూలిన ఘటనపై విపక్ష నేతలు ఏక్నాథ్ షిండే సారధ్యంలోని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదని ఎన్సీపీ-ఎస్పీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఎక్కడైనా విగ్రహ నిర్మాణం చేపడితే రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఈ ఘటనకు షిండే సర్కార్ పూర్తి బాధ్యత వహించాలని పేర్కొన్నారు. కాగా, ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తప్పుపట్టారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల ఘటనలపై కూడా షిండే సర్కార్‌పై ఠాక్రే విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, అవినీతి వ్యవహారాలు అదుపు తప్పాయని ఆరోపించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం ఎలా కుప్పకూలిందో రెండ్రోజుల కిందట ప్రజలు చూశారని, దీనిపై పాలకులు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారో గమనిస్తున్నారని అన్నారు.
బలమైన గాలుల కారణంగా విగ్రహం నేలకొరిగిందని వారు చెబుతున్నారని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. గాలులు ఉధృతంగా వీచడంతో విగ్రహం కూలి దెబ్బతిన్నదని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే చెబుతున్నారని అన్నారు. మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో 35 అడుగుల శివాజీ విగ్రహం నేలకూలడం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు భగ్గుమన్నాయి.
Read More :
Nadiminti Narasinga Rao | సినీ పరిశ్రమలో విషాదం.. టాలీవుడ్ సీనియర్ రైటర్ కన్నుమూత