Nadiminti Narasingrao | తెలుగు సినీ పరిశ్రమలో విషాదం. టాలీవుడ్ సీనియర్ రైటర్ నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇక నరసింగరావు మరణవార్త తెలుసుకున్న సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.
‘బొమ్మలాట’ అనే నాటకం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నరసింగరావు ఆ తర్వాత దూరదర్శన్‌లో ప్రసారమైన ‘తెనాలి రామకృష్ణ’ సీరియల్‌కు రైటర్‌గా పనిచేశాడు. ఈ సీరియల్ అప్పట్లో మంచి హిట్ అందుకుంది. అనంతరం ‘వండర్ బాయ్’, ‘లేడీ డిటెక్టివ్’, ‘అంతరంగాలుస వంటి పలు సీరియల్స్‌కు రైటర్‌గా పని చేశాడు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన మొదటి సినిమా ‘గులాబీ’ సినిమాతో పాటు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక రోజు’ సినిమాలకు మాటల రచయితగా నరసింగరావు పనిచేశారు.
Also Read..