పుణె : ఎన్సీపీ కీలక నేత అజిత్ పవార్ బీజేపీతో జట్టు కట్టే సూచనలు కనిపిస్తున్నాయి. శుక్రవారం ఆయన చేసిన వ్యాఖ్యలు దీనికి ఊతమిస్తున్నాయి. ఒక ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ ‘2024 వరకు వేచి చూడటం ఎందుకు? ఇప్పుడే మేం సీఎం పదవి పొందడానికి ప్రయత్నిస్తున్నాం’ అని అన్నారు. అయితే దీనిపై వివరంగా మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
మీరు సీఎం కావాలనుకుంటున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ తాను వంద శాతం సీఎం కావాలనుకుంటున్నానని చెప్పారు. 20 ఏండ్ల క్రితం 2004లో తమ పార్టీకి సీఎం పోస్టు లభించే అవకాశం వచ్చినా, కాంగ్రెస్కు సీఎం పీఠం కట్టబెట్టి, తాము డిప్యూటీ సీఎం పదవితో సర్దుకుపోయామని అన్నారు. మరోవైపు కర్ణాటక ఎన్నికల ఎన్సీపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో అజిత్ పవార్ పేరు కనిపించలేదు.