న్యూఢిల్లీ : పాఠశాల విద్యకు సంబంధించి ఎన్సీఈఆర్టీ కీలక ప్రకటన చే సింది. 2024-25 విద్యా సంవత్సరంలో 3, 6 తరగతులకు కొత్త సిలబస్‌తో కొత్త పాఠ్యపుస్తకాలను తీసుకొస్తున్నామని, మిగతా తరగతుల కు ఎలాంటి మార్పులూ లేవని వెల్లడించింది. ‘3వ తరగతి పుస్తకాలను ఏప్రిల్ చివరి వారంలో, 6వ తరగ తి పుస్తకాలను మే మధ్యలో విడుద ల చేస్తాం. 4,5,9,11 తరగతులకు బఫర్ స్టాక్ సిద్ధంగా ఉంది. అన్ని త రగతుల డిజిటల్ కాపీలను ఎన్సీఈఆర్టీ పోర్టల్ సహా, పీఎం ఇ-విద్య, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, దీక్ష నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు’ అని పేర్కొన్నది.