శ్రీనగర్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ శ్రీనగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఎన్సీ, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని లూటీ చేసినట్లు ఆరోపించారు. దోచుకోవడమే తమ జన్మహక్కుగా ఆ పార్టీలు భావించాయన్నారు. ఆ మూడు పార్టీల కుటుంబ పాలనలో.. జమ్మూకశ్మీర్ యువత నలిగిపోయినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద ఛాయలు లేకుండా తొలి సారి జమ్మూకశ్మీర్లో స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నట్లు మోదీ తెలిపారు. భారత ప్రజాస్వామ్యాన్ని జమ్మూకశ్మీర్ ప్రజలు బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్లో పాల్గొని చరిత్ర సృష్టించారన్నారు. జమ్మూకశ్మీర్లో అధిక సంఖ్యలో ఓటింగ్ జరగడం పట్ల గర్వంగా ఫీలవుతున్నట్లు ప్రధాని తెలిపారు.
#WATCH | Srinagar, J&K: Prime Minister Narendra Modi says “…The three families think that it is their birthright to capture power by any means and then loot you all. Their political agenda has been to deprive the people of Jammu and Kashmir of their legitimate rights. They have… pic.twitter.com/lsTADRKFv1
— ANI (@ANI) September 19, 2024