Chhattisgarh | న్యూఢిల్లీ, జనవరి 26: దేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని ఘనంగా జరుపుకుంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది. సుక్మా జిల్లా తుముల్పాడ్ గ్రామం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారత్ మాతాకీ జై, జై హింద్.. అంటూ పిల్లలు, పెద్దలు, యువకులు నినాదాలు చేశారు.
సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోగా, సీఆర్పీఎఫ్ నేతృత్వంలో గ్రామస్థులు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.