Naveen Patnaik | హింజిలీతోపాటు మరోస్థానం నుంచి పోటీ.. నవీన్ పట్నాయక్ కీలక ప్రకటన
Naveen Patnaik | బిజు జనతాదళ్ చీఫ్ (BJD), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Odisha Assembly Polls) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Naveen Patnaik | బిజు జనతాదళ్ చీఫ్ (BJD), ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Odisha Assembly Polls) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బుధవారం తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన ఐదో లిస్ట్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా తాను రెండు స్థానాల నుంచి బరిలోకి దిగినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలీ (Hinjili) స్థానంతోపాటు బోలంగీర్ జిల్లాలోని కాంతాబంజీ (Kantabanji) నియోజకవర్గం నుంచి కూడా పోటీకి దిగబోతున్నట్లు వెల్లడించారు.
కాగా, 2019లో కూడా నవీన్ పట్నాయక్ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. హింజిలీతోపాటూ బిజేపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో పోటీ చేయగా.. రెండు స్థానాల్లోనూ గెలుపొందారు. అయితే, ఆ తర్వాత బిజేపూర్ స్థానానికి రాజీనామా చేసి హింజిలీ స్థానం నుంచే అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
కాగా, లోక్‌సభ ఎన్నికలతోపాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్న విషయం తెలిసిందే. ఒడిశాలో మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటి వరకూ బీజేడీ 126 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక ఒడిశా అసెంబ్లీకి నాలుగు దశల్లో ఓటింగ్ జరగనుంది. మే 13, మే 20, మే 25, జూన్ 1వ తేదీల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జూన్ 4న కౌటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలు వెలువడనున్నాయి.
Also Read..
Surya Tilak | బాలరాముడికి సూర్యతిలకం.. లైవ్ ద్వారా వీక్షించిన ప్రధాని మోదీ
Surya Tilak | బాలరాముడికి సూర్యతిలకం.. అద్భుత దృశ్యాన్ని కనులారా వీక్షించిన భక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

