ముంబై : ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న పోరాటానికి తన పూర్తి మద్దతు ఉంటుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ప్రకటించారు. గురువారం ఆయనను ఢిల్లీ, పంజాబ్ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్ మాన్ ముంబైలో కలిశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి బీజేపీయేతర పార్టీలన్నీ ఐక్యంగా పోరాటం చేయాలని పవార్ అన్నారు. ప్రజలు ఓటేయకపోతే బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తారని, పరిపాలనకు అనుమతించరని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.