శ్రీనగర్: జమ్ముకశ్మీరులో శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఘన విజయం సాధించింది. అధికరణ 370 తర్వాత మొదటిసారి ఈ ఎన్నికలు జరిగాయి.
నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగగా మూడింటిలో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అభ్యర్థులు చౌదరి మహమ్మద్ రంజాన్, సజాద్ కిచ్లూ, జీఎస్ (షమ్మీ) ఒబెరాయ్ గెలిచారు, మరో స్థానంలో ఎన్సీ అభ్యర్థి ఇమ్రాన్ నబీ దార్‌ను బీజేపీ అభ్యర్థి సత్పాల్ శర్మ ఓడించారు. 54 ఓట్లలో శర్మకు 32 ఓట్లు లభించడంతో విజేతగా నిలిచారు.