Farooq Abdullah | శ్రీనగర్, ఆగస్టు 11: భారత సైన్యంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్దయెత్తున భద్రతా దళాలు సరిహద్దుల వెంబడి మోహరించినా ఉగ్రవాదులు యథేచ్ఛగా భారత్లోకి చొరబడుతున్నారని, మనల్ని నాశనం చేయడానికి భద్రతా దళాలు వారితో కుమ్మక్కవుతున్నాయని ఆయ న ఆరోపించారు.
దీనిపై జమ్ముకశ్మీర్ డీజీపీ ఆర్ఆర్ స్వైన్ మాట్లాడుతూ దేశ, సరిహద్దు రక్షణలో ఇప్పటివరకు 7 వేల మంది ప్రాణా లు కోల్పోయారని, మన సైనికులు శత్రుమూకలను ఎదుర్కోవడంలో ముందుండే దేశభక్తులని, అలాంటి వారిపై విమర్శలు శోచనీయమని అన్నారు.