తూత్తుకుడి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పినట్లే ప్రధాని మోదీ ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. ట్రంప్ ఆదేశాల ప్రకారమే మోదీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్ దళాలు అకస్మాత్తుగా ఇరాన్‌పై అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు మూడు రోజుల ముందే ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆయన నెతన్యహూతో భేటీ అయ్యారు. ఈ అంశాన్ని రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార ప్రసంగంలో ప్రస్తావించారు. ఒకవేళ ట్రంప్ దూకమంటే, మోదీ దూకేస్తారని అన్నారు. ఇరాన్లో వార్ ప్రారంభంకావడానికి ముందు ట్రంప్ ఆదేశాల ప్రకారం మోదీ ఇజ్రాయెల్ వెళ్లి వచ్చారని, దానికి కారణం చాలా సింపుల్ అని, ఎప్స్టీన్ ఫైల్స్.. అదానీ అని రాహుల్ ఆరోపించారు.