విద్యార్థిని కాటేసిన పాము
పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన రంజిత్ తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది.
- చికిత్స పొందుతూ మృతి
- ఎక్లాస్‌పూర్‌లో విషాద ఘటన
నారాయణపేటరూరల్, ఆగస్టు 6 : పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన రంజిత్ తరగతి గదిలో ఉండగా పాము కాటు వేసింది. ఒకసారిగా జరిగిన ఈ ఘటనతో పాఠశాలలో తీవ్ర భయాందోళన నె లకొంది. పాముకా టు కు గురైన రంజిత్‌ను వెంటనే జిల్లా దవాఖా న తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడం తో చికిత్స పొందుతూ రంజిత్ మృతి చెందాడు గ్రామంలో విషాదఛాయలు..
విద్యార్థి రంజిత్ మృతి చెందిన విషయం తెలియడంతో ఎక్లాస్పూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకు న్నాయి. పాఠశాలలో చదువుకోవాల్సిన బాలుడు పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వల్లే పాములు పాఠశాలలోకి వచ్చినట్లు అధికారులు ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహిస్తే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అన్ని ప్రభుత్వ పాఠశాలల వద్ద పారిశుధ్య చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేదు : మాజీ ఎమ్మెల్యే చిట్టెం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రాణాలకు భద్రత లేకపోవడం వల్లే ఎక్లాస్‌పూర్‌లో విద్యార్థి రంజిత్ పాముకాటుకు గురై మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నారాయణపేటలోని దవాఖానలోని విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం దవాఖాన ఎదుట జరిగిన ఆందో ళనలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి పాముకాటుతో మృతి చెంది ఏడుగంటలు కావస్తు న్నా ఏ ఒక్క జిల్లా అధికారి స్పందించకపోవ డం శోఛనీయం అన్నారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

