బికనీర్: ఈ యుద్ధం ద్వారా పాకిస్థాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టామని, సిందూరం గన్‌పౌడర్‌గా మారినప్పుడు ఏం జరుగుతుందో దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం వ్యాఖ్యానించారు. పహల్గాం దాడి క్రమంలో భారత్ ప్రతిస్పందనను ప్రపంచం మొత్తం చూసిందని, శత్రువులు స్వయాన దానిని అనుభవించారని అన్నారు.
ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన అనంతరం రాజస్థాన్‌లోని బికనీర్‌లో గురువారం తొలిసారిగా బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 22న తొమ్మిది అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను 22 నిమిషాల్లోనే ధ్వంసం చేసినట్టు చెప్పారు.