Rahul Gandhi: హిందూ మతాన్ని, ఆలయాలను ప్రధాని మోదీ పట్టించుకోరు: రాహుల్ గాంధీ
Rahul Gandhi: హిందూ మతాన్ని కానీ, ఆలయాలను కానీ ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. కేరళలో జరిగిన ఎన్నికల సభలో రాహుల్ మాట్లాడుతూ.. శబరిమలలో జరిగిన బంగారం చోరీ అంశాన్ని మోదీ విస్మరించినట్లు పేర్కొన్నారు. ఎల్డీఎఫ్, బీజేపీ ఒక్కటిగా పనిచేస్తున్నాయని ఆరోపించారు.
పాతానమిట్ట: కేరళలో ఏప్రిల్ 9వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ పాతానమిట్టలో జరిగిన సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. కేరళ పర్యటన వేళ శబరిమల అంశంపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారని ఆరోపించారు. దీని అర్థం బీజేపీ-ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అదూర్‌లో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో ప్రసంగిస్తూ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐఎం, బీజేపీ పార్టీలను సంయుక్తంగా ఎదుర్కోబోతున్నట్లు తెలిపారు. తమ పార్టీ ఎల్డీఎఫ్ తో పోటీపడుతోందని, కానీ ఆ పార్టీకి బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.
బీజేపీతో ఎవరు పోరాడినా, వారిపై బీజేపీ అటాక్ చేస్తుందని, తనపై అటాక్ జరిగిందని, నాపై 36 కేసులు ఉన్నాయని, 55 గంటల పాటు నిర్విరామంగా తనను ప్రశ్నించారన్నారు. అయితే కేరళ సీఎం పినరయి విజయన్‌పై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఎల్డీఎఫ్ నాయకత్వం చాలా భ్రష్టుపట్టిందని, ఆ పార్టీ నేతలపై కేసులు ఉన్నాయని, కానీ బీజేపీ నుంచి వారిపై వత్తిడి లేదని, దర్యాప్తులు జరగడం లేదని, వాళ్లకు బెదిరింపులు కూడా లేవని రాహుల్ గాంధీ అన్నారు.
ప్రధాని మోదీ ఎక్కడకు వెళ్లినా.. ఆలయాల గురించి మతం గురించి మాట్లాడుతారని, కానీ పాలక్కాడ్ పర్యటనలో ప్రధాని మోదీ శబరిమల అంశాన్ని లేవనెత్తలేదన్నారు. అయ్యప్ప స్వామి ఆలయం నుంచి లెఫ్ట్ ఫ్రంట్ నేతలు బంగారాన్ని దోచుకెళ్లిన విషయాన్ని ప్రధాని మరిచిపోయారని రాహుల్ అన్నారు. బంగారాన్ని ఎత్తుకెళ్లిన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు.. దాన్ని ఇత్తడితో నింపేశారని ఆరోపించారు. శబరిమల అంశంపై ప్రధాని మౌనంగా ఉండి బీజేపీకి నష్టం జరగకుండా చూసే ప్రయత్నం చేశారన్నారు. దీని వల్ల బీజేపీ, ఎల్డీఎఫ్ కలిసి పనిచేస్తున్నట్లు స్పష్టమైందని, ఇక ప్రధాని మోదీ మతాన్ని పట్టించుకోరని, హిందూ మతాన్ని కానీ ఆలయాలను కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ఓట్లు వస్తాయంటే, అప్పుడు ఆయన ఆలయాల గురించి మాట్లాడుతారని, ఎల్డీఎఫ్ ప్రయోజనాలను రక్షించాలంటే , ఆయన ఆలయాల గురించి మాట్లాడరని రాహుల్ అన్నారు. ఒకవేళ యూడీఎఫ్ అధికారంలోకి వస్తే, అప్పుడు ఆలయంలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్డీఎప్ ఓ లెఫ్ట్ పార్టీ తరహాలో వ్యవహరించడం లేదన్నారు. ఆ పార్టీ చర్యలు, విధానాలు అన్నీ.. బీజేపీకి కార్పొరేట్ తొత్తులా ఉన్నాయని, కార్పొరేట్ సపోర్టుతో ప్రభుత్వాన్ని నడుపుతున్నట్లుగా ఉందని రాహుల్ అన్నారు.
Rahul Gandhi exposing BJP and their communal politics.🔥🔥🔥
“Gold at Sabarimala Ayyappa Temple replaced with brass — and silence from those who shout religion 24/7.”
“Narendra Modi doesn’t care about Hinduism or temples — only votes.” pic.twitter.com/EA3tFEhjzk
— RAJAT (@RajatJain) March 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

