చెన్నై: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (80) శుక్రవారం కన్నుమూశారు. ఆయన ప్రమాదవశాత్తూ పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తున్నది. ఆయన చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో, లా గణేశన్ నిబద్ధత గల జాతీయవాది అని పేర్కొన్నారు.
తమిళనాడులో బీజేపీ విస్తరణకు ఆయన కృషి చేశారని, పార్టీకి మూలస్తంభం వంటివారని తెలిపారు. తమిళ సంస్కృతి పట్ల ఆయనకు అంకితభావం ఉందన్నారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. తమిళనాడు బీజేపీ నేత కే అన్నామలై కూడా లా గణేశన్ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.