Lok Sabha | బెంగళూరు : సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు యువకులు లోక్సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మనోరంజన్ తండ్రి దేవరాజే గౌడ స్పందించాడు.
నా కుమారుడు చాలా మంచి అబ్బాయి. అతను దయ, నిజాయితీ గల మనిషి. సమాజానికి మంచి చేయాలని కోరుకుంటాడు. సోసైటీ కోసం ఏదైనా త్యాగం చేయాలని తపనపడే యువకుడు. ఇక అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నానని దేవరాజే గౌడ పేర్కొన్నారు.
ఇక మనోరంజన్ మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కొంత కష్టమని చెప్పారు. 2016లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో జాబ్ చేశాడు. ప్రస్తుతం వ్యవసాయంపై మనోరంజన్ దృష్టి సారించినట్లు దేవరాజే గౌడ పేర్కొన్నారు.