ముంబై, అక్టోబర్ 23: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకాలపై విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ)లో పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్), శివసేన(యూబీటీ).. ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరిందని బుధవారం ఓ ప్రకటన విడుదలైంది. ముంబైలో ఎంపీ సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘మొత్తం 288 స్థానాలకుగాను 270 స్థానాల్లో అంగీకారం కుదిరింది. సమాజ్‌వాదీ, పీడబ్ల్యూపీ, సీపీఐ, సీపీఎం, ఆప్‌తో కలిసి ఎన్నికల బరిలో దిగాలని భావిస్తున్నాం’ అని అన్నారు.