Jaheer Hussain | చెన్నై, డిసెంబర్ 12: భరతనాట్యం కళాకారుడు జహీర్ హుస్సేన్ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. తమిళనాడు తిరుచ్చిలోని ‘శ్రీరంగం రంగనాథార్’ ఆలయంపై ఎనలేని భక్తిని చాటుకున్నారు. ఒక గరుడ పచ్చ, 600 వజ్రాలతో తయారుచేయించిన రూబీ కిరీటాన్ని ఆ ఆలయానికి విరాళంగా అందజేశారు.
ఎంతో విలువైన వజ్రాలు, రత్నాలను బంగారంపై పొదిగిన ఈ కిరీటాన్ని బుధవారం ఆలయ ప్రధాన అర్చకులకి అప్పగించారు. రాజస్థాన్ నుంచి తెప్పించిన ఎంతో ఖరీదైన 3,169 క్యారెట్లతో కూడిన రూబీ కిరీటాన్ని తయారు చేయడానికి తనకు 8 ఏండ్లు పట్టిందని జహీర్ హుస్సేన్ చెప్పారు. దేశంలో ప్రసిద్ధి చెందిన 108 వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి ఆలయం ఒకటి. ఇక్కడి ఆలయ రాజగోపురం ఆసియా ఖండంలోనే అతిపెద్దదిగా ఖ్యాతి పొందింది.