Rajnath Singh: పాక్‌లోని ప్రతి అంగుళం.. బ్రహ్మోస్ రేంజ్‌లోనే : రాజ్‌నాథ్ సింగ్
Rajnath Singh: పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం.. బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్‌లోనే ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు.
లక్నో: పాకిస్థాన్‌లోని ప్రతి అంగుళం.. బ్రహ్మోస్ మిస్సైల్ రేంజ్‌లోనే ఉన్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. లక్నోలోని సరోజిని నగర్లో ఉన్న బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించిన రాజ్‌నాథ్ అక్కడ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయ సైనిక బలగాలకు బ్రహ్మోస్ ఓ పిల్లర్‌లా మారిందన్నారు. ఇది దేశ విశ్వాస సామర్థ్యాన్ని పెంచిందన్నారు. కలలను నిజం చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్లో తయారీ అయిన ఫస్ట్ బ్యాచ్ క్షిపణలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ నుంచి ఫస్ట్ బ్యాచ్ మిస్సైల్ సిస్టమ్ విజయవంతంగా తయారీ అయ్యినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను మే 11వ తేదీన ప్రారంభించారు. మిస్సైల్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఫైనల్ క్వాలిటీ చెకింగ్‌కు కావాల్సిన అన్ని ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. విజయవంతంగా టెస్టింగ్ జరిగిన తర్వాత, ఆ మిస్సైళ్లను భారత సైనిక దళాలు మోహరించనున్నాయి. లక్నోలో జరిగిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాతక్, మంత్రినంద గోపాల్ గుప్తా నంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
#WATCH | Lucknow, UP | Defence Minister Rajnath Singh says, “The BrahMos team has signed contracts worth approximately RS 4,000 crore with two countries within just one month. In the coming years, we will see experts from other countries flock to Lucknow, making it a knowledge… pic.twitter.com/SOIA82uscd
— ANI (@ANI) October 18, 2025
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

