కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట ( Kasipeta) మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నాయకపుగూడెం గ్రామ యువకులకు మాజీ సర్పంచ్ వేముల కృష్ణ వాలీబాల్ కిట్లు ( Volley Ball Kit ) అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళుతూ క్రీడల మీద ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
క్రీడల మీద నైపుణ్యం పెంచుకొని ఉన్నత స్థాయి కి వెళ్లాలని కోరారు. గ్రామాభివృద్ధికి యువత కృషి చేయాలని పేర్కొన్నారు. వివిధ అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయాలని కోరారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉంటుందని వివరించారు. యువత సన్మార్గంలో నడిచి భావితరాలకు ఆదర్శంగా నిలువాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్, సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ చెండె నవీన్ కుమార్, ఇనుముల రవి, లవుడం మహేష్, సోమని రాజాం, ఎల్లయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.