Ruby Crown | ‘హిందూ- ముస్లిం భాయీభాయీ’.. మనదేశంలో సుపరిచితమైన నానుడి. హిందూ- ముస్లిం సఖ్యతను చాటిచెప్పే నినాదం ఇది. దీన్ని నిజం చేస్తూ.. మతసామరస్యానికి ప్రతీకగా ఓ ముస్లిం కళాకారుడు భక్తిని చాటుకున్నాడు. తమిళనాడులోని తిరుచ్చిలో (Trichy temple) గల ప్రఖ్యాత శ్రీరంగం రంగనాథర్ ఆలయానికి (Srirangam Ranganathar temple) 600 వజ్రాలతో ప్రత్యేకంగా తయారు చేసిన కిరీటాన్ని విరాళంగా ఇచ్చారు.
Ruby Crown2
ముస్లిం అయిన జహీర్ హుస్సేన్.. భరతనాట్య కళాకారుడు (Muslim Bharatanatyam artist). తన ప్రదర్శనల ద్వారా వచ్చిన మొత్తాన్ని కొద్దికొద్దిగా సేవ్ చేసి ఈ కిరీటాన్ని తయారు చేయించారు. బుధవారం ఆలయ ప్రధాన అర్చకుడు సుందర్ భట్టర్కు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జహీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. తనకు ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అనే తేడా లేదని తెలిపారు. ఈ కిరీటాన్ని గోపాల్ దాస్ అనే కళాకారుడు రూపొందించినట్లు చెప్పారు. దీన్ని రూపొందించేందుకు దాదాపు ఎనిమిదేళ్లు పట్టినట్లు వెల్లడించారు. 3,169 క్యారెట్ల బరువున్న ఒకే రూబీ రాయితో ఈ కిరీటాన్ని తయారు చేసినట్లు చెప్పారు. ప్రపంచంలోనే ఈ రకమైన మొదటి కిరీటం ఇది అని తెలిపారు.
Also Read..
Delhi | మొన్నటి వరకూ తీవ్ర కాలుష్యం.. ఇప్పుడు చలి.. ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Elon Musk | చరిత్ర సృష్టించిన మస్క్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు
Tirumala Rain | తిరుపతిలో భారీ వర్షంతో భక్తులకు ఇబ్బందులు..!